HomeEntertainmentరాష్ట్రానికి పెట్టుబ‌డులు..దావోస్ కి చంద్ర‌బాబు

రాష్ట్రానికి పెట్టుబ‌డులు..దావోస్ కి చంద్ర‌బాబు

రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల బృందంతో కలిసి దావోస్ పర్యటనకు బయలుదేరారు. రేపు ఉదయం జ్యూరిచ్‌లో పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. తరువాత హయత్ హోటల్ లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గంలో జ్యూరిచ్ నుంచి దావోస్ లో జరిగే WEF (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) సదస్సులో పాల్గొంటారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు వెళుతున్న ముఖ్యమంత్రికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, సిఎంవో అధికారులు సిఎం సర్….ఆల్ ది బెస్ట్ అంటూ విషెస్ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img