కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మాణం చేయడంతో బెంచ్ ఏర్పాటు చేయడం మన రాయలసీమ వాసులకు మంచి శుభాపరిణామమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు.. ప్రజావేదిక వద్ద న్యాయవాదుల సంఘం నాయకులు, న్యాయవాదులతో కలసి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేపట్టారు..