కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు చెప్పడానికి నా దగ్గరికి ఎవరూ రావొద్దని చెప్పారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ మృతి నేపథ్యంలో ఆయనీ నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ మన్మోహన్ మృతికి సంతాపంగా కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ లోపే న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకోవడం సరికాదని భావించిన శాసన సభాపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1న తనను వ్యక్తిగతంగా కలిసేందుకు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.