HomeEntertainmentయాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా ..చిరంజీవి మూవీ

యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా ..చిరంజీవి మూవీ

మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇకపై తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉంటుందని ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు హీరో నాని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి నాని కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుందని చెప్పారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. చిరంజీవి సినిమాల విషయానికి వస్తే… ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. వేసవికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తదుపరి చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img