టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది. చాలా కాలం తర్వాత అలాంటి సందర్భం వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి , అక్కినేని నాగార్జున, మహేశ్ బాబుతోపాటు అఖిల్, నమ్రతా శిరోద్కర్ ఒక్క చోట చేరి సందడి చేశారు. ఇంతకీ వీళ్లంతా ఎక్కడికెళ్లారో తెలుసా..? పాపులర్ టూరిజం స్పాట్ మాల్దీవులు .Greenko సీఈవో అనిల్ కుమార్ చలమలసెట్టి బర్త్ డే సందర్భంగా వీరంతా ఇలా సందడి చేశారు. కేక్ కట్ చేయించి అనిల్ కుమార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.