నూతన సంవత్సరంలో సిఎం రేవంత్ ప్రభుత్వం కీలక ప్రకటన చేశారు.. తెలంగాణ రాష్ట్ర CM రేవంత్ ప్రభుత్వం నూతన సంవత్సరంలో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. జనవరిలో రైతు భరోసా అమలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటికి సంబంధించి త్వరలోనే క్యాబినెట్ భేటీ నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగ నోటిఫికేషన్లపైనా ప్రకటన చేసే అవకాశముంది. దీంతో పాటు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.