HomePoliticalజానారెడ్డితో.. సీఎం రేవంత్ భేటీ..

జానారెడ్డితో.. సీఎం రేవంత్ భేటీ..

సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సుమారు అరగంటకు పైగా వీరి మధ్య పలు అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే జానారెడ్డితో సీఎం రేవంత్ భేటీపై ప్రభుత్వ వర్గాలలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. జానారెడ్డిని ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా జానారెడ్డిని నియమిస్తారని ప్రచారం జరుగుతోంది.ప్రభుత్వం అడిగితే సలహాలు ఇస్తాననని జానారెడ్డి బుధవారం మీడియాతో తెలిపారు. దీంతో వీరి భేటీపై అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. జానారెడ్డి వ్యాఖ్యల వల్లే.. ముఖ్య సలహాదారు పదవి ఆఫర్ చేయడానికి సీఎం వెళ్లారంటూ చర్చించుకుంటున్నారు. త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందనే ఊహాగానాలతో ఈ భేటీ ప్రాధాన్యతతలను సంతరించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read