HomePoliticalపేదోడి ఇంట్లో.. సీఎం రేవంత్ రెడ్డి భోజనం

పేదోడి ఇంట్లో.. సీఎం రేవంత్ రెడ్డి భోజనం

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో పర్యటించారు. ఈ సంద ర్భంగా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. వారి కష్టసుఖాల గురించి అడిగి తెలుసు కున్నారు. సన్నబియ్యం లబ్ధిదారుల కుటుంబంతో సహపంక్తి భోజనం చేసిన సీఎం.. లబ్ధి దారు కుటుంబం యోగ క్షేమాలు అడిగి తెలుసు కున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యురాలు తులసమ్మను ఆరా తీశారు.దొడ్డు బియ్యం పంపిణీ చేసినపుడు అసలు తీసుకునేందుకే ఆసక్తి చూపేవాళ్లం కాదని తుల సమ్మ సమాధాన మిచ్చింది. ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేసింది.

200 యూనిట్స్ ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాలు అందుతున్నాయా అని సీఎం రేవంత్ ఆరా తీశారు. ఉచిత బస్సు ప్రయాణం తమకు ఎంతో ఉపయోగ పడుతుందని తులసమ్మ సంతోషం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. దేశంలోనే తొలిసారి రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉగాది సందర్భంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉగాది సందర్భంగా హుజూ ర్‌‌నగర్‌‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌‌ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ స్కీమ్‌ను ప్రారంభించారు. పది మంది లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సభా వేదికపైన సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read