ఉత్తరప్రదేశ్ మహిళలకి శుభవార్త తెలిపారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సు సర్వీసుల్లో మహిళలు సగం ధరకే ప్రయాణించే అవకాశం కల్పించారు. డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను సీఎం యోగి ప్రారంభించారు. ఈ సర్వీసుల్లో ప్రయాణించే మహిళలకు టికెట్లపై 50 శాతం తగ్గింపును ప్రకటించారు. ఈ ప్రకటనతో సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. అంతేకాకుండా ప్రతి శనివారం ఉదయం హెరిటేజ్ మార్గంలో నడిచే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.