HomeEntertainmentప్రియ‌ద‌ర్శి ..న్యూ మూవీ ప్రేమంటే

ప్రియ‌ద‌ర్శి ..న్యూ మూవీ ప్రేమంటే

క‌మెడియ‌న్..న‌టుడు ప్రియ‌ద‌ర్శి కొత్త సినిమాకి పూజా కార్యక్రమం నిర్వహించారు. చిత్ర సమర్పకుల్లో ఒకడైన రానా దగ్గు బాటి క్లాప్ కొట్టగా.. సందీప్‌ రెడ్డి వంగా కెమెరా స్విఛాన్ చేసి ఈ మూవీని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీల్‌ నారంగ్‌, భరత్‌ నారంగ్‌, ఎస్‌వీఏసీఎల్‌ఎల్‌పీ, రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా సమర్పిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్తను షేర్ చేసింది రానా అండ్ టీం. ఈ మూవీకి ప్రేమంటే..? టైటిల్‌ను ఫైనల్ చేశారు.థ్రిల్‌ యు ప్రాప్తిరస్థు ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదే అసలైన ప్రేమకథ… థ్రిల్‌తో అంటూ విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో పాపులర్ యాంకర్ సుమ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ నవనీత్‌ శ్రీరామ్‌కు కూడా తొలి ప్రాజెక్ట్‌ కావడం విశేషం. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో ప్రియదర్శి విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడట. ఈ మూవీకి లియోన్‌ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే చిత్రీకరణ మొదలుకానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read