తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షమైన బిఆర్ ఎస్ నాయకులపై గురి పెట్టింది.దీనిలో భాగంగా
బిఆర్ఎస్ లో ముగ్గురు ముఖ్యనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి ముహూర్తం పెట్టేయబోతున్నట్లే ఉంది.కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసి ఘోష్ కమీషన్ ఈ నెలాఖరులోగా లేదా డిసెంబర్ మొదటి వారంలో మాజీ నీటిపారుదల, ఆర్ధిక శాఖల మంత్రి హరీష్ రావుకి నోటీస్ ఇచ్చి విచారణకు పిలిపించబోతున్నట్లు సమాచారం.
తర్వాత మాజీ సిఎం కేసీఆర్‌కు నోటీస్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో అవకతవకలపై జస్టిస్ మదన్ బి లోకూర్ కమీషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇదివరకు కమీషన్‌కు కేసీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి నోటీసులు పంపిస్తే “మీ కమీషన్‌కు విచారణ అర్హతే లేదు. రాజీనామా చేసి తప్పుకోవాలంటూ ఘాటుగా పెద్ద లేఖ వ్రాశారు. ఆ కమీషన్ని రద్దు చేయాలంటూ కేసీఆర్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కానీ ఆయన పిటిషన్ తిరస్కరించింది. ఇప్పుడు జస్టిస్ పీసి ఘోష్ కమీషన్ నోటీస్ పంపితే కేసీఆర్, హరీష్ రావులు విచారణకు హాజరవుతారో లేదో? మరోపక్క ఫార్ములా1 రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌ని అరెస్ట్ చేయడం ఖాయమని ముఖ్యమంత్రి, మంత్రులు చెపుతూనే ఉన్నారు. కనుక ముగ్గురికీ సిఎం రేవంత్ రెడ్డి ఒకేసారి ముహూర్తం పెట్టేయబోతున్నారేమో?