HomeEntertainmentరామ్ గోపాల్ వ‌ర్మ …అరెస్ట్ త‌ప్ప‌దా

రామ్ గోపాల్ వ‌ర్మ …అరెస్ట్ త‌ప్ప‌దా

టాలీవుడ్ వివాదాస్పద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ వర్మ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది…గ‌త వారం రామ్ గోపాల్ వ‌ర్మపై కేసు న‌మోదు అయిన విష‌యం తెలిసిందే. ప్ర‌కాశం జిల్లా మ‌ద్దిపాడు మండ‌లం పోలీస్ స్టేష‌న్‌లో ఐటీ చ‌ట్టం కింద వ‌ర్మపై కేసు న‌మోదు చేశారు పోలీసులు. వ్యూహం సినిమా స‌మ‌యంలో టీడీపీ అధినేత‌, ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌, నారా బ్రాహ్మాణిల‌ను కించ‌ప‌రిచేలా రామ్ గోపాల్ వ‌ర్మ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టినందుకు గాను మ‌ద్దిపాడు టీడీపీ మండ‌ల ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శి రామ‌లింగం ఈ కేసును పెట్టాడు.

ఇక రామ‌లింగం ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు వ‌ర్మ‌పై కేసు న‌మోదు చేశారు.అయితే ఈ కేసుపై విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సిందిగా.. ఏపీ పోలీసులు వ‌ర్మ‌కు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల ప్ర‌కారం మంగ‌ళ‌వారం వ‌ర్మ కోర్టుకు హాజ‌రుకావాల్సి ఉంది. అయితే అంత‌కంటే ముందే వ‌ర్మ ఏపీ హైకోర్ట్‌ను ఆశ్రయించి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే వ‌ర్మ‌ క్యాష్ పిటిష‌న్‌ను విచారించిన హైకోర్టు వ‌ర్మ చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల పిటిషన్ కొట్టివేసింది. అలాగే అరెస్ట్ నుంచి తాము రక్షించలేమని వర్మ న్యాయవాదికి కోర్టు స్పష్టం చేసింది. ఏదైనా ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. మ‌రోవైపు రేప‌టి పోలీసు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img