HomeEntertainmentమోహన్ బాబు పై..118 సెక్షన్

మోహన్ బాబు పై..118 సెక్షన్

హైదరాబాద్: మంగళవారం రాత్రి న‌టుడు మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికతో కలిసి జల్‌పల్లి లోని తన నివాసానికి రావడంతో వివాదం చోటుచేసుకుంది. తన ఏడు నెలల చిన్నారి లోపల ఉందని మనోజ్ విజ్ఞప్తి చేసినప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి రాకుండా అడ్డుకున్నారని, గేట్లకు తాళాలు వేసి వేసారట. బలవంతంగా లోపలికి వెళ్లడంతో పరిస్థితి మారిపోయింది. కొద్దిసేపటికే మనోజ్ చిరిగిన చొక్కాతో, గాయాలతో కనిపించాడు.ఈ సమయం లో ఘటనను కవర్ చేసేందుకు మీడియా వారు వెళ్లారు. అదే సమయంలో మోహన్ బాబు ఓ జర్న లిస్టు మైక్ లాక్కొని వారిపై దాడికి పాల్పడ్డారూ.

ఆ దాడిలో మీడియా ప్రతినిధికి తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తుంది. దాంతో తాజాగా మంచు మోహన్ బాబు పై కేసు నమోదు చేశారు. ఆయనపై 118 సెక్షన్ కింద షహర్ పహాడీ పీఎస్ లో కేసు నమోదు చేశారు. ఈ విషయానికి గాను మోహన్ బాబు వ్యతిగత విచార ణకు హాజరు కావాలని రాచకొండ సీపీ నోటీసులు జారీ చేసారు. ఒకవేళ మోహన్ బాబు నేరం చేసినట్టు రుజువైతే ఈ కేసుకు గాను మోహన్ బాబుకి మూడేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నా యి. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీడియో జర్నలి స్టుల సంఘం మోహన్ బాబు పై చర్యలు తీసుకో వాలని, డిమాండ్ చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img