కూల్ డ్రింక్స్ ని తాగడం వల్ల ఎముకలు బలహీనంగా మారి విరిగిపోయే అవకాశాలు ఉన్నాయని సైంటిస్టుల పరిశోధనలో తేలింది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌కు చెంఎదిన పరిశోధకులు 7 ఏళ్ల పాటు అధ్యయనం చేసి ఈ వివరాలను వెల్లడించారు. తరచూ కూల్ డ్రింక్స్ తాగేవారి ఎముకలు త్వరగా విరిగిపోయే అవకాశాలు ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లోనూ ఈ వివరాలను ప్రచురించారు. అయితే ఈ సమస్య మహిళల్లో మరింత ఎక్కువగా ఉంటుందని వారు అంటున్నారు. కనుక మహిళలు అసలు కూల్ డ్రింక్స్‌ను తాగకపోవడమే మంచిదని వారు సూచిస్తున్నారు.
.
కూల్ డ్రింక్స్‌లో రెండు సమ్మేళనాల శాతం ఎక్కువగా ఉంటుంది. కెఫీన్, ఫాస్ఫారిక్ యాసిడ్‌లు కూల్ డ్రింక్స్‌లో ఎక్కువగా ఉంటాయి. కెఫీన్ వల్ల మన శరీరం క్యాల్షియంను శోషించుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఇక ఫాస్ఫారిక్ యాసిడ్ వల్ల రక్తంలో ఉండే క్యాల్షియం మూత్రం ద్వారా బయటకు పోతుంది. ఇలా ఈ రెండు సమ్మేళనాలు చేటు చేస్తాయి. ఇవి రెండూ కూల్ డ్రింక్స్‌లో ఎక్కువగా ఉంటాయి. కనుక కూల్ డ్రింక్స్‌ను తాగితే శరీరానికి అసలు క్యాల్షియం లభించదు. ఫలితంగా ఎముకలు బలహీనంగా మారిపోతాయి. ఎముకలు విరిగిపోయే చాన్స్ ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు.
మెనోపాజ్ అనంతరం మహిళలల్లో క్యాల్షియం శోషించుకునే రేటు క్రమంగా తగ్గిపోతుంది. అలాంటప్పుడు కూల్ డ్రింక్స్ తాగితే శరీరానికి క్యాల్షియం అసలు ఏమాత్రం లభించదు. దీంతో మహిళల్లో ఎముకలు విరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే టీనేజ్ లో ఉన్నవారికి ఎముకల నిర్మాణం కోసం క్యాల్షియం అవసరం. కానీ కూల్ డ్రింక్స్‌ను అధికంగా తాగితే క్యాల్షియం లభించదు. దీంతో వారిలో నిర్మాణం ఆగిపోతుంది. దీంతోపాటు ఎముకలు బలహీనంగా మారుతాయి. కనుక మహిళలు, యువత, టీనేజ్‌లో ఉన్నవారు కూల్ డ్రింక్స్‌ను తాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, వాటిని అసలు తాగకపోవడమే మంచిదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.