టాలీవుడ్ నటుడు నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ పతాకంపై వస్తున్న తాజా చిత్రం కోర్ట్ . స్టేట్ వర్సెస్ ఏ నోబడీ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. నూతన దర్శకుడు రామ్ జగదీశ్ తెరెకెక్కించనున్నారు. ప్రశాంతి ఈ సినిమాను నిర్మిస్తుంది. గత ఏడాది ఆగష్టులో షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను ఉగాది పండుగా కానుకగా మార్చి 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
ఈ సందర్భంగా స్పెషల్ వీడియోను పంచుకుంది.నువ్వు మరి నేను అనుకున్నంత ఎదవవు ఏం కాదు. అంటే ఎంతో కొంత ఎదవనే అంటావు. ఏ కాదా.. సర్లే ఉండు.. నేను వెళ్లాలి.. హలో హలో.. నీ పేరు ఏంటి.. జాబిలి.. మరి నీ పేరు”.. అంటూ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో ఈ వీడియో ప్రారంభమైంది. వీడియో చూస్తుంటే.. అన్యాయంగా ఓ కేసులో ఇరుక్కుపోయిన ఓ పేదింటి కుర్రాడు…న్యాయం కోసం పోరాడే కథతో ఈ సినిమా రాబోతుంది. ఇందులో ప్రియదర్శి లాయర్ పాత్రలో నటించబోతున్నాడు. కాగా ఈ చిత్రంలో శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్దన్, శ్రీదేవి…కీలక పాత్రలు పోషిస్తున్నారు.