రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను సీఆర్డీఏ అధికారులు కేటాయించనున్నారు.ఈ మేరకు ఇవాళ లాటరీ తీసి ప్లాట్లు అప్పగించనున్నారు. 2014-19లో 14 గ్రామాల రైతుల నుంచి తీసుకున్న భూములకు బదులు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తామని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.ఈ మేరకు నవులూరు, కురగల్లు, నిడమర్రు, రాయపూడి, లింగాయపాలెం, మల్కాపురం, నెక్కల్లు, శాఖమూరు, తుళ్లూరు, వెలగపూడి, మందడం, అనంతవరం, ఐనవోలు గ్రామాల రైతులకు ప్లాట్లు అప్పగించనున్నారు.ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు ఆన్ లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా ప్లాట్లు కేటాయించేందుకు రంగం సిద్ధం చేశారు. 14 గ్రామాల ప్రజలు ఈ లాటరికీ హాజరుకావాలని సీఆర్డీఏ పిలుపునిచ్చారు.