నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్ . 2023లో వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రద్ధ శ్రీనాథ్, పగ్వా జైశ్వల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మూవీ నుంచి రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్‌ను పంచుకున్న విషయం తెలిసిందే. అయితే రిలీజ్ ట్రైలర్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లాంఛ్ చేద్దాం అనుకున్నారు. కానీ తిరుమల తొక్కిసలాట ఘటనలో భక్తులు మరణించడంతో ఈ వేడుకను వాయిదా వేశారు. దీంతో రిలీజ్ ట్రైలర్‌ను నేడు వదిలింది చిత్రబృందం.