డాకు మహారాజ్ సినిమాలో మొదటి నుంచే దబిడి దిబిడి సాంగ్ కూడా డాకు మహారాజ్ పై హైప్ పెంచింది. ఇప్పుడు థియేటర్లలో ఈ సాంగ్ కు అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. బాలయ్య, ఊర్వశి స్టెప్పులకు విజిల్స్ పడుతున్నాయి. అయితే ఈ సూపర్ హిట్ సాంగ్ లోని కొన్ని స్టెప్పులపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై నటి ఊర్వశి రౌతెలా స్పందించింది. ఒక సినిమా సక్సెస్ అయినప్పుడు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. నేను ఈ విషయాన్ని అర్థం చేసుకోగలను. బాలకృష్ణ ఒక లెజెండ్. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఇదంతా కళలో ఓ భాగం. బాలయ్యతో డ్యాన్స్ చేయడమనేది సినిమా పరంగానే కాదు.. కళపై నాకున్న గౌరవానికి ప్రతీకగా నేను భావిస్తాను. డ్యాన్స్, నటనకు ప్రాధాన్యం ఉండే ఎలాంటి భిన్నమైన సినిమాలనైనా నేను గౌరవిస్తాను. బాలయ్యతో పనిచేయడం నా కల. ఈ సినిమాతో అది నెరవేరింది. నటీనటులకు ఆయన ఎంతో గౌరవమిస్తారు. సపోర్టు కూడా చేస్తారు’ అని బాలయ్యపై ప్రశంసలు కురిపించింది.