HomeEntertainmentఅల్లు అర్జున్ చేసిన త‌ప్పేంటి..పురందేశ్వరి

అల్లు అర్జున్ చేసిన త‌ప్పేంటి..పురందేశ్వరి

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ కారణం కాదని ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. ఆ సినిమాలో హీరో కాబట్టి అల్లు అర్జున్ పుష్ప-2 ప్రదర్శిస్తున్న థియేటర్ వద్దకు వచ్చాడని అన్నారు. ఆ తొక్కిసలాట ఘటన ఆయన ప్రేరేపించింది కాదని పేర్కొన్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ11 గా ఉన్నారని, అలాంటప్పుడు మిగతా వాళ్లను కాకుండా అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కొత్త మామిడిపాలెం రోడ్డులో ఈ రోజు కాకతీయ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బాలికల వసతి గృహం భూమి పూజ కార్యక్రమంలో పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను మీడియా ప్రతినిధులు అల్లు అర్జున్ ఇష్యూపై స్పందన కోరగా, ఆమె తాజా వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img