మాజీ మంత్రి విడదల రజనిపై యడవల్లి దళిత రైతులు పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ భూములను అన్యాయంగా, అక్రమంగా లాగేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రజినీ పైన, అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పైన కేసు నమోదు చేయాలని వారు కోరారు. తమను మభ్యపెట్టి విలువైన గ్రానైట్ నిక్షేపాలున్న భూములను చేజిక్కించుకున్నారన్నారు.