HomeEntertainmentద‌ర్శ‌న్ నా కుమారుడి లాంటివాడు..సుమ‌ల‌త‌

ద‌ర్శ‌న్ నా కుమారుడి లాంటివాడు..సుమ‌ల‌త‌

న‌టుడు ద‌ర్శ‌న్ త‌న కుమారుడిలాంటివాడ‌ని న‌టి..సుమ‌ల‌త అన్నారు. అత‌నితో గ‌తంలో త‌న‌ సంబంధం ఎలా ఉందో ఇప్ప‌టికీ అలాగే ఉంద‌న్నారు. ద‌ర్శ‌న్ భార్య విజ‌య‌లక్ష్మితో తాను నిత్యం మాట్లాడుతూనే ఉన్నాన‌ని తెలిపారు. ద‌ర్శ‌న్ శ‌స్త్ర‌చికిత్స‌కు నిరాక‌రించ‌డంతో వెన్ను నొప్పి నుంచి బ‌య‌ట ప‌డేందుకు మ‌రింత ఎక్కువ స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌న్నారు. న‌టుడు ద‌ర్శ‌న్‌కు క‌ర్ణాట‌క హైకోర్టు సింగిల్ జ‌డ్జి బెంచ్ ఇటీవ‌ల మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసిన విష‌యం తెలిసిందే. అనారోగ్యం కార‌ణంగా వైద్యచికిత్సల‌ కోసం ఆరు వారాల గ‌డువుతో బెయిల్ మంజూరు చేసింది. కాగా, అభిమాని రేణుక‌స్వామి హ‌త్య కేసులో జూన్ 11న ద‌ర్శ‌న్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img