పుష్ప’ మూవీతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారారు డాలీ ధనుంజయ్. ఈ సినిమాలో జాలిరెడ్డిగా నటించి తన విలనిజంతో ఆకట్టుకున్నారు. అయితే, ఇటీవల తాను ప్రేమించిన ధన్యత అనే అమ్మాయితో ధనుంజయ్‌కి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. గతేడాది నవంబరులో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. , తన పెళ్లి డేట్, ప్లేస్ ను ధనుంజన్ ఇన్‌స్టా వేదికగా వినూత్నంగా ప్రకటించారు. తాను క్లాప్ కొట్టే బోర్డుతో కనిపించగా… తన భార్య డాక్టర్ గా స్టెతస్‌స్కోప్ పట్టుకుని ఉన్న ఫొటోలను షేర్ చేశారు. అలాగే తమ వివాహం మైసూర్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరగబోతున్నట్లు తెలిపారు. చిన్నప్పటి నుంచి చదువుకున్న ఊరు కావడంతో అక్కడే పెళ్లి చేసుకోవాలని ధనుంజయ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ జంటకు ఫిబ్రవరి 15, 16 తేదీల్లో పెళ్లి జరగనుంది. ఈ విషయాన్ని నటుడు తన ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నారు. కాగా, చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ధన్యత వైద్యురాలు. ఈ ఇద్దరికీ చాలా కాలంగా పరిచయం ఉంది. అది కాస్త ప్రేమగా మారడంతో ఇప్పుడు పెళ్లిబంధంలోకి అడుగుపెడుతున్నారు.