HomeEntertainmentశ్రీతేజ్ తండ్రికి జాబ్ ఇస్తా..దిల్ రాజు

శ్రీతేజ్ తండ్రికి జాబ్ ఇస్తా..దిల్ రాజు

కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌ రాజు పరామర్శించారు. కుటుంబసభ్యులు, డాక్టర్లతో మాట్లాడి శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంధ్య థియేటర్‌ ఘటన దురదృష్టకరం. రేవతి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామన్నారు. శ్రీతేజ్‌ త్వరగా కోలుకోవాలన్నారు. సీఎం రేవంత్ అపాయింట్ మెంట్ కోరాం. రేపు లేదంటే ఎల్లుండి సీఎం రేవంత్‌రెడ్డి కలుస్తాం. అల్లు అర్జున్‌ను కూడా కలుస్తామన్నారు. సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేస్తా. రేవతి కుటుంబం వినోదం కోసం థియేటర్‌కు వెళ్లారు. కావాలని ఎవరైనా ఇలా చేస్తారా అన్నారు దిల్‌ రాజు. రేవతి భర్త భాస్కర్‌కు సినీ ఇండస్ట్రీలో శాశ్వత ఉద్యోగం కల్పిస్తామన్నారు. సమస్యను పరిష్కరించేందుకు ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా బాధ్యత తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాన్ని కాపాడుకోవడమే అందరి లక్ష్యమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img