తెలుగు దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి యేలేటి సుబ్బారావు తుదిశ్వాస విడిచారు. 75 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. యేలేటి సుబ్బారావు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలోని రేఖవానిపాలెం గ్రామం. ఆక్కడే ఆయన కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, రాజమౌళి భార్య రమ యేలేటి సుబ్బారావు మృతికి సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని పరామర్శిం చారు. యేలేటి సుబ్బారావు మృతిపట్ల సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు సంతాపం తెలుపుతున్నా రు. యేలేటి సుబ్బారావు అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం ఆయన స్వగ్రా మంలో జరగనున్నాయి.