రీసెంట్‌గా వెలుగుల పండుగ దీపావళి వేడుకలను హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకలకు హీరోయిన్ రష్మిక వచ్చినట్లు తెలుస్తోంది. దివాళీ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన కొన్ని సోలో ఫొటోలను రష్మిక తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. అందులో రెడ్ అండ్ వైట్ డ్రెస్‌లో ఈ కన్నడ సోయగం మెరిసిపోతూ కనిపించింది. చేతిలో దీపాలతో ఫొటోలకు ఫోజులిచ్చింది. ‘దీపావళి ఫోటోషూట్ డన్..! దీపావళి శుభాకాంక్షలు మై లవ్లీస్’ అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. అయితే, కింద కామెంట్ సెక్షన్‌లో ‘ఫొటో క్రెడిట్: ఆనంద్ దేవరకొండ .. థ్యాంక్యూ ఆనంద్’ అంటూ పేర్కొంది. దీంతో విజయ్ ఫ్యామిలీతో దివాళి సెలబ్రేషన్స్ చేసుకున్నట్లు చెప్పకనే చెప్పినట్లైంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. మరోవైపు విజయ్ దేవరకొండ సైతం తన ఫ్యామిలీతో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రష్మిక పోస్ట్‌తో వీరి ప్రేమ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చినట్లైంది.