HomeEntertainmentక్రికెటర్ ఉన్ముక్త్ చంద్.. జీవితంపై డాక్యుమెంటరీ..

క్రికెటర్ ఉన్ముక్త్ చంద్.. జీవితంపై డాక్యుమెంటరీ..

టీమిండియా అండర్-19 క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి, 2012లో ప్రపంచ కప్‌ను సాధించి పెట్టిన డాషింగ్ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ జీవిత కథపై డాక్యుమెంటరీ తెర‌కెక్కుతుంది. అతని జీవిత ప్రయాణం ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ చిత్రం ‘అన్‌బ్రోకెన్: ది ఉన్ముక్త్ చంద్ స్టోరీ'(). రాఘవ్ ఖన్నా దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీని రివర్‌ల్యాండ్ ఎంటర్‌టైన్‌మెంట్, తుడిప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు నిర్మించాయి. దీప్తి అగర్వాల్, జైశ్రీ ఖన్నా, తుషార్ ఉప్‌శంకర్, మరియు రాఘవ్ ఖన్నా నిర్మాతలుగా వ్యవహరించగా, ప్రియాంక చౌదరి సహ నిర్మాతగా ఉన్నారు. ఈ డాక్యుమెంటరీ PVR INOX పిక్చర్స్ ద్వారా సెప్టెంబ‌ర్ 12న‌ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా ట్రైల‌ర్‌ను పంచుకున్నారు మేక‌ర్స్. 2012లో ఆస్ట్రేలియాలో జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఉన్ముక్త్ చంద్ ఫైనల్లో ఆతిథ్య జట్టుపై అద్భుతమైన సెంచరీ (111 నాటౌట్) చేసి జట్టుకు కప్ అందించాడు. ఈ విజయంతో అతను క్రికెట్ ప్రపంచంలో ఒక సంచలనంగా మారాడు. అనంత‌రం ఉన్ముక్త్‌ దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ, ఉత్తరాఖండ్ జట్ల తరపున ఆడాడు. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ వంటి టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. ఇక దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించినప్పటికీ, సీనియర్ భారత జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. దీంతో, 2021లో భారత క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి, అమెరికాకు వెళ్లాడు. ప్రస్తుతం ఉన్ముక్త్ చంద్ అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ (MLC)లో లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ వంటి జ‌ట్టు తరఫున ఆడుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, మరియు ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read