HomeEntertainmentటాలెంట్ ని ఎవ‌రూ ఆప‌లేరు..జానీ మాస్ట‌ర్

టాలెంట్ ని ఎవ‌రూ ఆప‌లేరు..జానీ మాస్ట‌ర్

లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్ర‌ముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్ట‌ర్‌కు బిగ్ షాక్ త‌గిలిన విష‌యం తెలిసిందే. జానీను డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొల‌గించిన‌ట్లు ఉద‌యం నుంచి వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. అయితే వార్త‌ల‌కు సంబంధించి తాజాగా జానీ మాస్ట‌ర్ స్పందించాడు.ఉద‌యం నుంచి ఒక ఫేక్ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. నన్ను డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొల‌గించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ వార్త‌ల‌ను ఎవ‌రు న‌మ్మ‌కండి. ఇవి ఫేక్. న‌న్ను ఏ అసోసియేషన్ నుంచి తొల‌గించ‌లేదు. నా కార్డును ఎవ‌రు తీసేయ‌లేదు. నేను ఇప్ప‌టికే డ్యాన్సర్ అసోసియేషన్‌లో స‌భ్యుడినే. నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా వెళుతున్నాను. టాలెంట్ ఉన్నవారికి పనివ్వకుండా, దొరక్కుండా ఎవ్వరూ ఆపలేరు. నా కొరియోగ్రఫీలో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న గేమ్ ఛేంజ‌ర్ నుంచి ఓ మంచి పాట రాబోతుంది, మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. అంటూ జానీ చెప్పుకోచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img