నెల్లిమర్ల నగర పంచాయతీ ఈరోజు కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చైర్మన్ అనుమతితో .. మున్సిపల్ కమిషనర్ ఆహ్వానం మేరకు హాజరైయ్యారు నెల్లిమర్ల నియోజకవర్గం టిడిపి ఇంఛార్జి & ఏపీ మార్క్ ఫెడ్ చైర్మన్ శ్రీ కర్రోతు బంగార్రాజు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు రాజకీయం తెలియదు ..కానీ నాకు ఉన్న పరిజ్ఞానం తో చెప్తున్నా. పంచాయతీ ఎన్నికలకు టీడీపీ నీ నిర్వీర్యం చేద్దామని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి ఉద్దేశ్యం. ఒక వేళ టిడిపి వాళ్లు ఎవరైనా ఆమె ఉచ్చులో పడితే మండలం కూడా పోతుంది. అందుకే ఏదో ఒకటి చేసి నియోజకవర్గం తెలుగు దేశం నాయకులు కళ్ళు తెరవక పోతే భవిష్యత్తులో ప్రజలకు సమాధానం చెప్పవలసింది తెలుగు దేశం నాయకులు మాత్రమే. చెన్నకేశవ రెడ్డి సినిమా లో దేవాయని చెప్పినట్టు మధ్యలో వచ్చాడు మధ్యలోనే పోతాడు అన్నట్టు వాళ్లు ఎలాగో పోతారు. కానీ ఈ తప్పును సరిదిద్దు కోవడానికి మరో ఐదు సంవత్సరాలు పడుతుంది. మీరు గుర్తుంచుకోండి పంచాయతీ ఎన్నికలలో టీడీపీ vs జనసేనా అవుతుంది.. ఇది పక్కా . టీడీపీ నాయకులు మేలుకుంటే మంచిది. గతం లో కూడా ఇప్పుడు జరిగే పరిణామాలు గురించి ముందే అంటే ఎలెక్షన్ అవ్వక ముందే కొందరి నాయకులకు చెప్పాను వాళ్లు ఈజీగా తీసుకున్నారు. ఆమె మరో ఐదు సంవత్సరాలు ప్రణాళిక గీస్తుందని తెలిపారు.