HomePoliticalటిబెట్ లో పెను భూకంపం..32మంది మృతి

టిబెట్ లో పెను భూకంపం..32మంది మృతి

టిబెట్ లో పెను భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో నేపాల్ – టిబెట్ సరిహద్దుల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1 పాయింట్లుగా నమోదైంది. పలు భవనాలు, భారీ వృక్షాలు నేలమట్టం అయ్యాయి. భూకంపం కారణంగా ఇప్పటి వరకు 32 మంది మరణించారని టిబెట్ అధికారవర్గాలు తెలిపాయి. ఈమేరకు చైనా అధికారిక మీడియా సంస్థ జిన్హువా వార్త కథనాలు ప్రసారం చేసింది. భూ ప్రకంపనలు అటు నేపాల్ లో, ఇటు ఇండియాలోని పలు రాష్ట్రాల్లోనూ నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో, బిహార్, అసోం, పశ్చిమ బెంగాల్ లోనూ భూమి కంపించింది. మంగళవారం ఉదయం వెంటవెంటనే మూడుసార్లు భూమి కంపించిందని, మొదటి భూకంపం తీవ్రత 7.1 పాయింట్లు కాగా ఉదయం 7:02 గంటలకు 4.7 తీవ్రతతో మరోసారి భూమి కంపించిందని, తర్వాత 5 నిమిషాలకు 4.9 తీవ్రతతో మరో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ట్వీట్ చేసింది. భౌగోళిక పరిస్థితులు, భూగర్భంలోని టెక్టానిక్ ప్లేట్స్ కదలికల కారణంగా హిమాలయాల పక్కనే ఉన్న నేపాల్ లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2015లో సంభవించిన పెను భూకంపంలో దాదాపు 9 వేల మంది చనిపోగా, 25 వేల మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 5 లక్షలకు పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img