మా అమ్మానాన్నలు చనిపోయిన తరువాత మా అన్నయ్యలు నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారని నటి రోజా తెలిపారు. సెల్వమణి సినిమా చేస్తున్న సమయంలోనే ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది. నేను పెద్దగా మాట్లాడతాను గానీ, ఇంట్లో పెత్తనం ఆయనదే అని అన్నారు. సమరం’ సినిమాను సొంత బ్యానర్ లో చేశాం. ఆ సినిమా సమయంలోనే నాకు ప్రమాదం జరిగింది. దాంతో ఆ సినిమా పూర్తి కావడానికి .. విడుదల చేయడానికి చాలా సమయం పట్టింది. అందువలన ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది. మా అబ్బాయి కౌశిక్ ఇప్పుడే 6 అడుగులు ఉన్నాడు .. చదువుకుంటున్నాడు.
తనకి హీరో కావాలని ఉంది .. అలాగే డైరెక్షన్ పై కూడా ఇంట్రస్ట్ ఉంది. భగవంతుడి ఆశీస్సులు ఎలా ఉంటే అలా” అని అన్నారు. మా పాప అన్షు మాలికకి మాత్రం చదువు అంటేనే ఇష్టం. తనకి సైంటిస్ట్ కావాలని ఉంది. ఒకవేళ యాక్టింగ్ వైపు వస్తామంటే మాకు కూడా సంతోషమే. నాకు మూడు చోట్లా మూడు ఇళ్లు ఉన్నాయి. అవన్నీ నేను రాజకీయాలలోకి రావడానికి ముందు ఉన్నవే. ఇక మూడు కార్లు ఉన్నాయి. 150 సినిమాలు చేసిన నాకు బెంజ్ కారు ఉండటంలో ఆశ్చర్యం ఏముంది. ట్రోలింగ్ చేసే వాళ్లను గురించి నేను పట్టించుకోను అని చెప్పారు.