టాలీవుడ్‌లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడంతో పాన్ ఇండియా స్టార్‌డమ్ సంపాదించిన అతికొద్ది మంది మాలీవుడ్ యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు ఫహద్ ఫాసిల్ . ఇటీవలే రజినీకాంత్ వెట్టైయాన్ సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు. ఫహద్ ఫాసిల్ నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప ది రూల్ డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ స్టార్ యాక్టర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారుతుంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. లవ్‌స్టోరీగా రాబోతున్న ఈ చిత్రంలో యానిమల్ ఫేం తృప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుందని ఇన్‌సైడ్ టాక్. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని సమాచారం. తృప్తి డిమ్రి ఇప్పటికే ఇంతియాజ్ అలీ లైలా మజ్ను సినిమాలో నటించింది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతుందని తెలుసుకోవాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.