ప్రస్తుతం మనకి తెలియని ప్లేస్ కి వెళ్లాలంటే గూగుల్ మ్యాప్ ని ఫాలోఅవుతున్నాం. సేఫ్ గా వెళ్తే సరే..కానీ ఒక్కోసారి తప్పు అడ్రస్ వల్ల చిక్కుల్లో పడే ప్రమాదం చోటు చేసుకుంటుంది.అలాంటి సంఘటనే ఇప్పుడు రీసెంట్ గా జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవా బయలుదేరిన ఓ కుటుంబం దట్టమైన అడవిలో చిక్కుకుని రాత్రంతా అక్కడే గడిపారు. బీహార్‌కు చెందిన రాజ్‌దాస్ రంజిత్‌దాస్ కుటుంబం కారులో గోవా బయలుదేరింది. చిన్నారులు సహా మొత్తం ఆరుగురు ఉన్నారు. మ్యాప్స్ పెట్టుకుని బయలుదేరిన వీరు భీమ్‌గఢ్ వైల్‌లైఫ్ జోన్‌లో 7కి.మీ లోపలికి వెళ్లిపోయారు. అక్కడ సిగ్నల్స్ లేకపోవడంతో.. బయటపడే మార్గం లేక కారు లాక్ చేసుకుని రాతంత్రా అందులోనే గడిపారు.