అక్కినేని నాగచైతన్య , శోభిత ధూళిపాళ్ల వివాహం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే, వీరి వివాహం వేళ సమంత పోస్ట్ ఆసక్తికరంగా మారింది . సామ్ సోషల్ మీడియా వేదికగా స్ఫూర్తినింపే వీడియోలు, కొటేషన్లూ పంచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇన్‌స్టా స్టోరీస్‌లో తాజాగా షేర్ చేసింది. ఈ వీడియోలో ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య కుస్తీ పోటీ జరుగుతోంది. మొదట్లో ఆ అబ్బాయి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆటలోకి దిగుతాడు. చివరికి అమ్మాయి చేతిలో ఓడిపోతాడు. ఈ వీడియో షేర్ చేసిన సామ్.. ‘ఈ అమ్మాయిలా పోరాడండి’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం పోస్ట్ వైరల్‌గా మారింది.