ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏపిని అభివృద్ధి పథంలో నడిపించాలని రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినీ కోరారు మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ..విజయవాడలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛాంబర్ లో పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మంగళవారం విజయా నంద్ ను కలిసి పుష్ప అందించి మర్యాద పూర్వకంగా కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లో అగ్ర భాగాన నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వెనుకబడిన ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగిన సహాయ సహకారాలు అందిస్తున్నారని, మీరు మీ తోపాటు అధికార యంత్రాంగం అదే స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి, ఉమ్మడి అనంతపురం జిల్లా సమగ్ర అభివృద్ధికి తగిన తోడ్పాటు నివ్వాలని కోరారు. అదే విధంగా మీకు ,మీ కుటుంబ సభ్యులకు, రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగానికి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డికి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.