HomePoliticalఆరు నెలల తర్వాత అసెంబ్లీకి..కేసీఆర్

ఆరు నెలల తర్వాత అసెంబ్లీకి..కేసీఆర్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్, ప్రతిపక్ష నేత కేసీఆర్‌ అసెంబ్లీకి హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. ఆరు నెలల తర్వాత అసెంబ్లీకి వచ్చిన తమ అధినేతకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనకు అసెంబ్లీ గేటు వద్ద స్వాగతం పలికారు. పార్టీ ఎమ్మెల్యేలు వెంటరాగా కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశమై సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలకు మాజీ సీఎం కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. సభలో అనుసరించాల్సిన పద్ధతిపై దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

https://twitter.com/AadhanTelugu/status/1899688865679479182

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read