ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి ఉచిత ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఈ ప్రత్యేక షోలను నిర్వహిస్తున్నారు. వీటిలో భాగంగా, జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో రాజానగరం నియోజకవర్గంలోని మూడు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 9, 10, ఇంటర్, డిగ్రీ విద్యార్థుల కోసం నేడు ఉచిత ప్రదర్శనలు జరుగనున్నాయి. సీతానగరంలోని గీతా సినిమాస్ మరియు కోరుకొండలోని రామకృష్ణ థియేటర్లలో ఈ షోలు ప్రదర్శితం కానున్నాయి. రాజానగరం నియోజకవర్గంతో పాటు, రాష్ట్రంలోని మరికొన్ని ఏరియాలలో కూడా ఈరోజు ‘హరిహర వీరమల్లు’ ఫ్రీ షోలు వేయనున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.