ఏపీ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా జి.ప్రతిభాదేవి నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం కర్నూలు లోని ఫ్యామిలీ కోర్టు/నాలుగో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా సేవలును అందిస్తున్నారు. న్యాయశాఖ కార్యదర్శిగా ప్రతిభాదేవి నియామకానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమె రెండేళ్లపాటు డిప్యుటేషన్ పై పని చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.