HomePoliticalకేటీఆర్,కౌశిక్ రెడ్డికి, అసెంబ్లీ స్పీకర్ స్ట్రాంగ్ వార్నింగ్

కేటీఆర్,కౌశిక్ రెడ్డికి, అసెంబ్లీ స్పీకర్ స్ట్రాంగ్ వార్నింగ్

అసెంబ్లీలో సహజంగా శాంత స్వభావంతో స్పీకర్ విధులు నిర్వహించే గడ్డం ప్రసాద్ బుధవారం నేటి సమావేశాల సందర్భంగా ఆగ్రహావేశాలను లోనయ్యారు.
ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదంచిన సందర్భంగా ఆటో డ్రైవర్ల సమస్యలపై సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య చర్చ పరస్పర విమర్శలతో సభ వేడెక్కింది. ఈ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపి.వివేకా నంద, పాడి కౌశిక్ రెడ్ది, కేటీఆర్, లు ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యల చేశారు. వివేకానంద వ్యాఖ్యల పట్ల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర అభ్యం తరం వ్యక్తం చేయగా, వాటిని రికార్డుల నుంచి తొలగిస్తానని స్పీకర్ ప్రసాద్ ప్రకటించారు. ముఖ్యంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని స్పీకర్ హెచ్చరించారు. సభ నిబంధన ప్రకారం నడుచు కోవాలని సూచించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కేటీఆర్ కు స్పీకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వెళ్లి ఎవరి స్థానంలో వాళ్లు కూర్చో వాలని కూర్చోక పోతే సభ నుండి సస్పెండ్ చేస్తానని, ఇద్దరిని గట్టిగానే అరిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img