సినిమా రిలీజ్ కు ముందే గేమ్ చేంజర్ ఈ ప్రీ రిలీజ్ వేడుక ద్వారా చరిత్ర సృష్టించింది. ఓ భారతీయ సినిమా అమెరికా గడ్డపై ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకోవడం గేమ్ చేంజర్ తోనే ప్రథమం. డాలస్ లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు అభిమానులు పోటెత్తారు. ఇక్కడి కర్టిస్ కల్వెల్ సెంటర్ క్రిక్కిరిసిపోయింది. పుష్ప-2 దర్శకుడు సుకుమార్ ఈ వేడుకకు హాజరుకావడం విశేషం. హీరో రామ్ చరణ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు. థాంక్యూ సో మచ్ అమెరికా… మోస్ట్ మెమరబుల్ నైట్ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. గేమ్ చేంజర్ సినిమా కోసం ఈ అద్భుతమైన ఈవెంట్ ను నిర్వహించిన రాజేశ్ కల్లేపల్లి అండ్ టీమ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు రామ్ చరణ్ తన పోస్టులో పేర్కొన్నారు. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం గేమ్ చేంజర్. సౌతిండియా దర్శక దిగ్గజం శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం జనవరి 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.