HomeEntertainmentబిగ్ బాస్ నుండి బ‌య‌టికి గంగ‌వ్వ‌

బిగ్ బాస్ నుండి బ‌య‌టికి గంగ‌వ్వ‌

గంగ‌వ్వ పేరు రెండు తెలుగురాష్ట్రాల్లో మారుమోగుతోంది. కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 పదో వారంలోకి అడుగు పెట్టింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చి కూడా ఐదు వారాలు గడిచిపోయాయి. కాగా మై విలేజ్ షో ఫేమ్, ఫేమస్ యూబ్యూబర్ గంగవ్వ కూడా వైల్డ్ కార్డ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. గతంలో సీజన్ లో మెయిన్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఆమె హౌస్ వాతావరణానికి అలవాటుపడలేకపోయారు. దీనికి తోడు అనారోగ్య సమస్యలు ఆమెను చుట్టు ముట్టాయి. దీంతో కేవలం ఐదు వారాలు మాత్రమే హౌస్ లో ఉండి ఆ తర్వాత ఉండలేనని చెప్పి బయటకు వచ్చేసారు. ఇక సీజన్ 8 లో మళ్లీ వైల్డ్ కార్డ్ గా కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టారు గంగవ్వ. అయితే ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆమె ఇప్పటికే వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇది సీజన్ లోనే అర్ధమైపోయింది. దీంతో మళ్లీ హౌస్ లోకి ఆమెను తీసుకురావడంతో చాలా మంది షాక్ అయ్యారు.

ఐతే వచ్చీ రాగానే ఒక ఫిజికల్ టాస్కులో గెలిచి సర్ ప్రైజ్ చేశారామె. అయితే ఆ తర్వాత గంగవ్వ కేవలం మాటలకు మాత్రమే పరిమితమయ్యారు. వయసు దృష్ట్యా ఫిజికల్ టాస్కులు ,గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం లేదు. ఇక తోటి కంటెస్టెంట్స్ కూడా నామినేషన్స్ నుంచి గంగవ్వను మినహాయిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వకు మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. . ఒళ్లు నొప్పులు, కాళ్లు నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయంటూ గత శనివారం ఎపిసోడ్ లో నాగార్జునతో కూడా చెప్పుకుని బాధపడ్డారామె. అయితే ప్రస్తుతం పరిస్థితి చూస్త్ఉంటే గంగవ్వ తనంతట తాను హౌస్ నుంచి వెళ్తే తప్ప ఆడియన్స్ ఆమెను ఎలిమినేట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఈక్రమంలోనే అనారోగ్యం దృష్ట్యా గంగవ్వ కూడా సెల్ఫ్ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లాలనుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ వీకెండ్ కూడా గంగవ్వ వెళ్తా అంటే మాత్రం ఎలిమినేషన్ లేకుండానే గంగవ్వని బయటకు పంపించేస్తారని తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img