HomeEntertainmentగంగో రేణుక త‌ల్లి జాత‌ర‌..ఫుల్ సాంగ్

గంగో రేణుక త‌ల్లి జాత‌ర‌..ఫుల్ సాంగ్

గంగో రేణుక తల్లి జాత‌ర వీడియో సాంగ్‌ను విడుద‌ల చేసింది పుష్ప‌2 చిత్ర యూనిట్. ఈ జాతర ఎపిసోడ్‌లో అల్లు అర్జున్‌ మాస్ తాండవం చేశాడు. దాదాపు 30 నిమిషాల‌కు పైగా ఉన్న ఈ సీన్ బ‌న్నీ కెరీర్‌కు హైలెట్‌గా నిలిచింది. ఆస్కార్ అవార్డు విజేత చంద్ర‌బోస్ ఈ పాట‌కు లిరిక్స్ అందించ‌గా.. మ‌హాలింగం పాడాడు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. థియేట‌ర్‌లో ఉర్రుత‌లు ఊగించిన ఈ సాంగ్‌ను మీరు కూడా చూసేయండి. అగ్ర క‌థానాయ‌కుడు అల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘పుష్ప 2 ది రూల్‌’ . సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాలో రష్మిక కథానాయిక న‌టించింది. డిసెంబ‌ర్ 05న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.1760 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. మ‌రికొన్ని రోజుల్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన బాహుబ‌లి(రూ.1804 కోట్ల‌) సినిమా రికార్డును కూడా ఈ చిత్రం అధిగ‌మించ‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read