AP: రాష్ట్రంలో జీబీఎస్ మరణాలు పెరుగుతుండడంతో భయాందోళనలను పెంచుతోంది. ఈ వ్యాధి సోకి ఇప్పటికే ముగ్గురు మరణించారని అధికారులు వెల్లడించారు. మరణాలు, కేసులు పెరగడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లాలో మొదటి జీబీఎస్ కేసు నమోదైంది. భగత్ సింగ్ నగర్కు చెందిన గోకారమ్మ(46) అనే మహిళకు జీబీఎస్ వ్యాధి సోకింది. ఆమెకు కర్నూలు జీజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు.