HomeEntertainmentడ‌ల్లాస్ ఫ్యాన్స్ తో..రామ్ చ‌ర‌ణ్

డ‌ల్లాస్ ఫ్యాన్స్ తో..రామ్ చ‌ర‌ణ్

గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్… డల్లాస్ నగరంలో తన అభిమానులతో ముచ్చటించారు. డల్లాస్ లో నేడు గేమ్ చేంజర్ గ్లోబల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హీరో అల్లు అర్జున్, నిర్మాత దిల్ రాజు తదితరులు అమెరికా తరలి వెళ్లారు. ఇక, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందు అభిమానులతో నిర్వహించిన కార్యక్రమంలో రామ్ చరణ్, దిల్ రాజు పాల్గొన్నారు.

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం గేమ్ చేంజర్. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.రిలీజ్ డేట్ కు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. అందులో భాగంగానే అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. అమెరికా గడ్డపై ప్రీ రిలీజ్ వేడుక జరుపుకుంటున్న మొట్టమొదటి భారతీయ సినిమాగా గేమ్ చేంజర్ చరిత్ర సృష్టిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read