చంద్రబాబునాయుడు గతంలో తీసుకువచ్చిన జన్మభూమి కార్యక్రమం సక్సెస్ అయిన విషయం తెలిసిందే.కాగా మళ్లీ జన్మభూమి కార్యక్రమాన్ని తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు.ఏపీలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సంక్రాంతి తర్వాత జన్మభూమి-2 కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మరింత సమర్థవంతంగా పథకాల అమలు, అభివృద్ధి పనులపై ఫోకస్ చేయనున్నారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు, ప్రభుత్వం, అధికార యంత్రాంగాన్ని అనుసంధానం చేశారు. జన్మభూమి 2.0 కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ శాఖలపై సమీక్ష చేపట్టనున్నారు. జన్మభూమి కార్యక్రమం పూర్తయిన వెంటనే విజయవాడ-గుంటూరు మధ్యలో నూతన రాజధానికి అవసరమైన భూమి సమీకరణపై చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.