ఈరోజు అసెంబ్లీ సమావేశాలు మొదలయిన వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో చేనేత సమస్యలపై జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి మాట్లాడుతూ… చేనేత కార్మికుల సమస్యలను లేవనెత్తారు. అనంతరం రఘురాజు మాట్లాడుతూ లోకం మాధవి మాట్లాడిన తీరును అభినందించారు. చేనేత సమస్యలను చక్కగా వివరించారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు నెలకు ఒక రోజు చేనేత వస్త్రాలను ధరించేలా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అని మాధవి ప్రశ్నించగా… ఇంతకీ మీరు ధరించింది చేనేత చీరనా? లేక వేరే చీరనా? అని రఘురాజు ప్రశ్నించారు. తాను చేనేత చీరను ధరించానని ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారు. దీంతో సభలో నవ్వులు విరబూశాయి.