HomePoliticalగ్రీన్ ఎన‌ర్జీ ప్రాజెక్ట్..ఏపీలో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌

గ్రీన్ ఎన‌ర్జీ ప్రాజెక్ట్..ఏపీలో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌

ఈ నెల 29న ఏపీ లోపర్యటించనున్నా రు ప్రధాని మోదీ. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తారని సమాచారం. అనకాపల్లి సమీపంలోని పూడిమడక లో ఎన్టీపీసీ తలపెట్టిన గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో బహిరంగ సభ జరుగుతుందని తెలుస్తోంది. దాని నిర్వహణపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులు ఏయూ మైదానాన్ని పరిశీలించారు. ఇదే పర్యటనలో విశాఖ రైల్వేజోన్‌తో పాటు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారని తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img