అరసవల్లి రథసప్తమి వేడుకల్లో భాగంగా జిల్లాలో హెలికాప్టర్ టూరిజం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేపడుతున్నారు. ఈ హెలికాప్టర్ టూరిజం డచ్ బిల్డింగ్ దగ్గర హెలిపాడ్ వద్ద నిర్వహిస్తారు, అయితే ఇందులో 6మంది వరకు ట్రావెల్ చేయవచ్చు. దీనికి రూ.2వేలు వరకు ప్రతి ఒక్కరికి ఛార్జ్ ఉండే అవకాశం ఉంది. దీనిపై మరో రెండు మూడు రోజులు అధికారిక ప్రకటన రావాల్సిఉంది.