హీరో కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్నాడు. తన భార్య రహస్య గోరక్ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఆయన మా ప్రేమ 2 అడుగుల మేర పెరుగుతోంది అని ట్వీట్ చేశారు. దీంతో అందరూ కిరణ్ అబ్బవరం దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తన మొదటి చిత్రం ‘రాజావారు రాణివారు’లో నటించిన హీరోయిన్ రహస్యను కిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది ఆగస్టులో ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ‘క’ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. త్వరలోనే ‘దిల్రూబా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం టీజర్ ఆకట్టుకుంటోంది. ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అలాగే కిరణ్ కెరీర్లో రాజావారు రాణివారు’తో పాటు ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’, ‘వినరో భాగ్యం విష్ణు కథ’, ‘క’ వంటి మంచి హిట్ చిత్రాలు ఉన్నాయి.