తన భార్యని పరిచయం చేశాడు హీరో శ్రీసింహ. ఇప్పటికీ ఆరేళ్లయ్యింది. ఎప్పటికీ ఇలాగే ” అంటూ రాసిపెట్టుంది అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు. అంటే ఆరేళ్లుగా రాగ, శ్రీసింహ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే వీరిద్దరు పెద్దలను ఒప్పించి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగ్గా ఈనెల 14న దుబాయిలోని ఓ ఐలాండ్ లో పెళ్లి జరిగింది. నటుడు మురళీ మోహన్ తనయుడు రామ్ మోహన్ కుమార్తె రాగ మాగంటి. విదేశాల్లో బిజినెస్ లో మాస్టర్స్ పూర్తి చేసిన రాగ మాగంటి.. ప్రస్తుతం తన ఫ్యామిలీకి సంబంధించిన వ్యాపారాలు చూసుకుంటుంది.