HomePoliticalమూసీనది ప్రక్షాళనపై హైకోర్టు..మార్గదర్శకాలు

మూసీనది ప్రక్షాళనపై హైకోర్టు..మార్గదర్శకాలు

మూసీనది ప్రక్షాళనపై హైకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది..అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది.నదిలో మురుగునీరు కలవకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్ట్‌పై 46 పిటిషన్లను విచారించి,  హైకోర్టు  నిర్ణయాత్మక తీర్పును వెల్లడించింది.నది గర్భం, బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ ప్రాంతాల్లో ఉన్న చట్టవిరుద్ధ నిర్మాణాలను తక్షణమే తొలగించాలని పేర్కొంది. మూసీలోకి మురుగు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలను జారీ చేసింది.ఈ తీర్పులో ఆక్రమణదారులకు నోటీసులిచ్చాకే చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.

1)నిర్మాణాల తొలగింపుమూసీ బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్, రివర్‌బెడ్‌ ప్రాంతాల్లో ఉన్న చట్టవిరుద్ధ నిర్మాణాలను నిర్దిష్ట గడువులోగా ఖాళీ చేయించాలి.సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆక్రమణదారులకు నోటీసులిచ్చాకే కూల్చివేత చర్యలు చేపట్టాలి.2. ప్రభావితులకు పునరావాసం పునరుద్ధరణతో ప్రభావితులైన వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సర్వే నిర్వహించాలి.పేదలకు ప్రభుత్వ పథకాల కింద అనువైన ప్రాంతాల్లో నివాసాలను కల్పించడంతో పాటు తగిన పరిహారం కూడా అందించాలి.3. నిర్వహణ పద్ధతులుఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లను గుర్తించడానికి నిర్వహించే సర్వేకు ఎలాంటి అడ్డంకులు సృష్టించరాదని ఆక్రమణదారులకు హెచ్చరిక.ఈ చర్యల అమలు కోసం పోలీసు భద్రతను అందించాలని హైకోర్టు ఆదేశించింది.4. ఆక్రమణదారులపై చర్యలునదులు, చెరువులు, నీటి వనరులపై ఆక్రమణలు చేపట్టిన వారిపై వాల్టా చట్టం, తెలంగాణ నీటిపారుదల చట్టాల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img